Friday, May 15, 2026
E-PAPER
Homeసినిమాఅసాధ్యాలు సుసాధ్యాలవుతాయి..

అసాధ్యాలు సుసాధ్యాలవుతాయి..

- Advertisement -

ఆధ్యాత్మికతను, మానవ సంబంధాలను మేళవిస్తూ శ్రీ ఆది లక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘ఏదైనా సాధ్యమే. దైవం తోడుంటే..అనేది ఉపశీర్షిక. ఈ చిత్ర టైటిల్ ఆవిష్కరణ ఫిల్మ్ ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. ప్రతి మనిషి తన ఇష్ట దైవంతో బలమైన అనుబంధాన్ని పెంచుకోవడం ద్వారా జీవితంలోని దుఃఖాల నుండి, బాధల నుండి ఎలా విముక్తి పొందవచ్చనే అంశాన్ని ఈ సినిమా ద్వారా చూపించనున్నారు. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాణం మొత్తం శ్రీ అమ్మ భగవాన్ బోధనల ఆధారంగా రూపొందుతోందని చిత్ర యూనిట్ ప్రకటించింది. సినిమా కథనం ప్రధానంగా శ్రీ అమ్మ భగవాన్ చెప్పిన ఈ ఐదు సూత్రాల చుట్టూ తిరుగుతుందని వెల్లడించారు. 'నీవు ప్రత్యేకమైన వ్యక్తివి, నీ ఆంతరంగిక ప్రపంచమే బాహ్య ప్రపంచం, వ్యక్తి లేడు, వ్యక్తిత్వాలు మాత్రమే ఉంటాయి, అంతర్గత సత్యము, జీవితమంటేనే బాంధవ్యాలు వంటి ఈ అంశాల ఆధారంగానే సినిమా క‌థ‌నం ఉంటుంద‌ని తెలిపారు. కథ, మాటలు, సాహిత్యాన్ని అందిస్తూ నిర్మిస్తున్న అనిల్ కుమార్ మునగనూరి మాట్లాడుతూ, ‘ఒక వ్యక్తికి జీవితంలో భగవంతుడి బంధం ఉన్నట్లయితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో, అసాధ్యాలు సుసాధ్యాలుగా మారుతాయి అనేది ఈ చిత్రం ద్వారా చెప్పదలుచుకున్నాం. దేశానికి ముఖ్యమైన యువత ఎలా ఉండాలో కూడా తెలియజేస్తున్నాం` అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -