Saturday, January 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసదాశివపేటలో పెద్ద మోరీ కబ్జాకు యత్నం 

సదాశివపేటలో పెద్ద మోరీ కబ్జాకు యత్నం 

- Advertisement -

నవతెలంగాణ – మెదక్ ప్రాంతీయ ప్రతినిధి : సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలో పెద్ద మోరీ కబ్జాకు యత్నిస్తున్నారు. గతంలో కూడా కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించగా పట్టణ వాసులు అడ్డుకోవడంతో కబ్జా యత్నాలు విరమించుకున్నారు.  కాగా తిరిగి శనివారం మున్సిపల్ అధికారుల సహకారంతో కొందరు రాజకీయ నాయకులు చెత్తను పెద్ద మోరీ లో వేసి పూడ్చుతూ ఆక్రమణకు పూనుకున్నారు. అదేవిధంగా  పెద్ద మోరి జాతీయ రహదారి పక్కనే ఉండడం అందులో చెత్త వేయడంతో దుర్వాసన వెదజల్లి రోగాల బారిన పడతామని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు పక్కనే చెత్తను డంపింగ్ చేయడంతో పందులు స్వైర విహారం చేసి హఠాత్తుగా రోడ్డుపైకి పందులు రావడంతో ప్రమాదాల బారిన పడిన సంఘటన చాలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకా పెద్ద మోరీ ఆక్రమణకు మున్సిపల్ అధికారులు సహకరిస్తున్నారని పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణను ఆపాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -