Saturday, January 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుడంపింగ్ మిషన్‍లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి

డంపింగ్ మిషన్‍లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. చెత్త డంపింగ్ యార్డ్ లో చెత్త తొలగించే మిషన్ లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు యూసఫ్ గూడ డంపింగ్ యార్డ్ వద్ద జరిగింది. ఉదయం చెత్త తొలగించే క్రమంలో లారీ డోర్ విఫలమైంది. ఇంతలో అతడి కాలు జారి చెత్తను తొలగించే మిషన్ అతడిని తనలోపలికి లాగేసుకుంది. తోటి కార్మికులు ఇది గ్రహించి బయటకు తీసేలోపు అతడు చనిపోయాడు. మృతుడిది ఆంధ్రప్రదేశ్‍లోని కర్నూల్ జిల్లా దుగ్గలి మండలం పగిడిరాయి వాసిగా గుర్తించారు. అయితే రాంకీ సంస్థ నిర్లక్ష్యం వల్లే కార్మికుడు చనిపోయారని యూసఫ్ గూడ డంపింగ్ యార్డ్ వద్ద విధులు బహిష్కరించి జీహెచ్ఎంసీ స్వచ్ఛ కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం న్యాయం చేసే వరుక ఆందోళన విరమించేది లేదని నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -