నవతెలంగాణ బాల్కొండ
బొగ్గు కుంభకోణం బయటపడడంతో ప్రజల దృష్టి మళ్లించడానికి బీఆర్ఎస్ నాయకులకు నోటీసులు అందజేస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యులు ఎం ఏ షాహిద్ ఆరోపించారు. మండల కేంద్రంలో శనివారం షాహిద్ మీడియా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో బొగ్గు కుంభకోణం బయటపడడంతో ప్రజల దృష్టి మళ్లించడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సీట్ నోటీసులు అందజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తుందని దుయ్యబట్టారు.
సిట్ నోటీసుల డ్రామా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నా అరాచకాలకు రానున్న నగర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇకనైనా ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.



