Saturday, January 24, 2026
E-PAPER
Homeజిల్లాలుగాంధారి జడ్పీహెచ్ఎస్ లో మాక్ పార్లమెంట్

గాంధారి జడ్పీహెచ్ఎస్ లో మాక్ పార్లమెంట్

- Advertisement -

– ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ వ్యవస్థపై అవగాహన పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్

నవతెలంగాణ గాంధారి

ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ వ్యవస్థపై అవగాహన పెంపొందించేందుకు గాంధారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రాష్ట్రపతి, సభాపతి, ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, మంత్రులు, సభ్యులు గా పాత్రలు పోషిస్తూ లోక్‌సభ సమావేశాల నిర్వహణను చక్కగా ప్రదర్శించారు.మాక్ పార్లమెంట్ ద్వారా స్పీకర్ ఎన్నిక, బిల్లుల ప్రవేశం, ప్రశ్నోత్తర కాలం, జీరో అవర్ చర్చలు, తీర్మానాల ఆమోదం వంటి అంశాలను విద్యార్థులు ఆసక్తికరంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, వాక్చాతుర్యం, ప్రజాస్వామ్యంపై గౌరవం పెంచిందని ఉపాధ్యాయులు తెలిపారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మార బాల్ రెడ్డి మాట్లాడుతూ మాక్ పార్లమెంట్ అంటే భారత ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకునే ఒక ప్రత్యక్ష విద్యా ప్రయోగశాల అన్నాడు.పుస్తకాలలోచదివేరాజ్యాం

 ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, బాల్ రెడ్డి శ్రీనివాస్ లక్ష్మినర్సయ్య శంకర్ గౌడ్ మల్లేష్ రాజపండిట్ చక్రదర్ సాయిలు జ్ఞానేశ్వర్. వాణి నాగలక్ష్మి. సంగీత శ్రీదేవి శరణ్య , రాధాదేవి, మారుతి హాజరై విద్యార్థులను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -