- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ బండ్లగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువును డీసీఎం ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. భర్తతో కలిసి ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డీసీఎం డ్రైవర్ స్కూటీని ఢీ కొట్టి ఆగకుండా పారిపోయాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.
- Advertisement -



