ఇప్పుడే ఏం చెప్పలేను
డాక్టర్ : ఎంసెట్ పరీక్ష ఎలా రాశావు?
కొడుకు : పేపర్ చాలా క్రిటికల్‌గా వుంది నాన్నా. ఇప్పుడే ఏం చెప్పలేను.
వసూలు చెయ్యాలి
టీచర్ : (మంత్రి కొడుకుతో) వరదలొస్తే ఏం చేయాలి? ఎటువంటి జాత్త్రలు తీసుకోవాలి?
మంత్రి కొడుకు : వెంటనే చందాలు వసూలు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలి.
అబద్దం
లాయర్ : (కొడుకుతో) నువ్వు ఇప్పటికిప్పుడు ఒక అబద్దం చెప్పగలిగితే నీకు వంద రూపాయలు ఇస్తాను.
కొడుకు : అబద్దమా! అది మా ఇంటా వంటా లేదు. నువ్వు నాకు ఇస్తానన్న రెండు వందలు ఇచ్చెరు.
ఉద్యోగం
పూజారి : ఉద్యోగానికి రెజ్యూమె పంపించావా?
కొడుకు : రెజ్యుమెతో పాటు మన గోత్రం, రాశి, నక్షత్రం కూడా రాసి పంపించాను నాన్నా.
ఎందుకు?
తండ్రి : నిన్ను ఎం.పి.సి గ్రూప్ తీసుకోమంటే నువ్వు బైపిసి గ్రూప్ ఎందుకు తీసుకున్నావ్?
కొడుకు : అమ్మ టీవీలో సీరియల్ పెట్టమంటే నువ్వెందుకు వార్తలు పెడతావ్?
ఎప్పుడైనా రావచ్చు
వాతావరణ శాఖాధికారి : పరీక్షా ఫలితాలు ఎప్పుడొస్తాయి?
కొడుకు : రాబోయే 48 గంటల్లో ఎప్పుడైనా రావొచ్చు.
ఎలాగో తెలియక
నీటి పారుదల శాఖాధికారి : కాలమెందుకు వృథా చేస్తావు?
కొడుకు : స్టోరేజ్ చేయడం ఎలాగో తెలియక!
రోజు విడిచి రోజు
పేకాట పాపారావు : జీవితంలో ఎప్పుడూ జూదం ఆడకురా. జూదంలో ఒకరోజు గెలిస్తే, మరో రోజు ఓడిపోతాం.
కొడుకు : అయితే రోజు విడిచి రోజు ఆడతాలే నాన్నా!



