Sunday, January 25, 2026
E-PAPER
Homeకవితస్ఫూర్తిదాయక పిలుపు

స్ఫూర్తిదాయక పిలుపు

- Advertisement -

అభిలభారత ప్రజాతంత్ర మహిళాసంఘం పిలుస్తోంది,
హైదరాబాద్‌కు, సాయుధ దళాల రీతిన సాగి రారే చెల్లీ!
‘ఐద్వా’ జిందాబాద్‌, జిందాబాద్‌ ‘ఐద్వా’ అంటూ సాగిన్రే, అంగనలందరూ,
హైదరాబాదుకు, సాయుధ దళాలరీతిన సాగిరారే, చెల్లీ!! (కోరస్‌తో)
కొంగు నడుముకుచుట్టవే చెల్లీ!
కొడవలి చేపట్టవే చెల్లీ… కొండు నడుముకు… చెల్లీ!!
చేలల్లో చెలకల్లో శ్రమించినావే చెల్లీ!
చెమటోడ్చి సంపద వెల్ల కూర్చినావే చెల్లీ,
ఇంటిల్లపాదికి ‘ఇలవేల్పు’వైనావే చెల్లీ
జగానికే వెలుగు దివ్వెవైనావే చెల్లీ!! కొంగు నడుముకు!!
చైతన్యమంతా నీదెనే చెల్లీ, చెంగలువవు నీవెనే చెల్లీ!
పొత్తిళ్ల బిడ్డలున్నా, చెల్లీ, పోరుకు సిద్దమే చెల్లీ, రావే చెల్లీ,
పెన్నుకైనా, గన్నుకైనా, పట్టు వీడని పడతివీవే చెల్లీ,
పలు ఉద్యమాలకు ‘దిక్చూచి’వి నీవేనే యువతీ రావే చెల్లీ!! కొంగు!!
పొంచి వున్న ప్రమాదమే! చెల్లీ కార్మిక చట్టాల నిషేధము, రావే చెల్లీ
రాజ్యాంగ ఉల్లంఘనే చెల్లీ, దొడ్డిదారిలోనే చెల్లీ, చలామణే చెల్లీ
రాబందులే చెల్లీ, భూమి పతులైరే చెల్లీ, పోదాం రావే చెల్లీ, రా! రావే చెల్లీ || కొంగు
సంఘటితం కావాలే చెల్లీ, కార్మిక కర్షక బాధిత మహిళలందరూ, చెల్లీ!
ఎదిరించాలే చెల్లీ, ‘ట్రంప్‌’ నైనా, వాడబ్బనైనా ఎదిరించాలే చెల్లీ, రా! చెల్లీ!
భవితవ్యం భావితరాల ‘యువతులదే’ చెల్లీ, బంగరు బాట, రా! రావే చెల్లీ!
ఎగరేద్దాం శాంతి జెండాను, పాటిద్దాం ‘ఐద్వా’ పిలుపునూ పోరాడుదాం రావె చెల్లీ!!
కొంగు నడుముకు చుట్టవే చెల్లీ!
కొడవలి చేపట్టవే చెల్లీ… కొడవలి… చేపట్టవే… చెల్లీ!!
బోడపాటి అప్పారావు, 9381509814

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -