పచ్చని అడవిలో కొలువైన సమ్మక్క సారక్క
కుంకుమ బరిణే లో గద్దెకు పయనం
కోయ పూజారులతో కొలువైన చిలకలగుట్ట
తల్లికి తడి బట్టలతో తానాలతో పూనకాలు!!
ధరణిలో సమ్మక్క సారక్కలు
కంక వనంలో సమ్మక్క సారక్క
మమ్ముకాపాడే సమ్మక్క సారక్క
కోయ ప్రాంతమందు సమ్మక్క సారక్క!!
వీరులు శూరులు సమ్మక్క సారక్క
త్యాగాల సిరులు సమ్మక్క సారక్క
కుంకుమ భరణిలో సమ్మక్క సారక్క పూజలు
సమ్మక్క సారక్క దీవెనలతో కొంగుబంగారం!!
తల్లికి నిలువెత్తు బంగారు బెల్లంతో భక్తుల మొక్కులు
అంబరమంటే సంబురం మన మేడారం
కోరిన కోరికలు తీర్చే సమ్మక్క సారక్కలు
భారతదేశం లో జరిగే అతి పెద్ద జాతరమేడారం!!
వన జాతర మన జాతర మేడారం
పచ్చని అడవిలో పవిత్ర జాతర మేడారం
బంగారం పెట్టి బాగుండాలని కోరే భక్తులు
నలుమూలల నుండి తరలివచ్చే భక్తులు
మహిమలున్న దేవతా మూర్తి సమ్మక్క
ములుగులో మూడు రోజుల పండుగ
మన మేడారం జాతర!!
దేవులపల్లి రమేశ్, 9963701294
మహా జాతర మన మేడారం
- Advertisement -
- Advertisement -



