Sunday, January 25, 2026
E-PAPER
Homeఆటలుఓటమి కోరల్లో హైదరాబాద్‌

ఓటమి కోరల్లో హైదరాబాద్‌

- Advertisement -

ముంబయితో రంజీ ట్రోఫీ పోరు

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ముంబయితో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓటమి అంచుల్లో నిలిచింది. రాహుల్‌ సింగ్‌ (96), హిమతేజ (40) మినహా ఇతర బ్యాటర్లు విఫలమవగా తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ 82.2 ఓవర్లలో 267 పరుగులకు కుప్పకూలింది. 293 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన ముంబయి.. ఆతిథ్య జట్టును ఫాలోఆన్‌ ఆడించింది. ఫాలోఆన్‌లో 39.3 ఓవర్లలో 166/7తో ఓటమి ముంగిట నిలిచింది. ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-డి మ్యాచ్‌లో నేడు ఆఖరు రోజు. చివరి రోజు ఆటలో ముంబయి విజయానికి 3 వికెట్లు అవసరం కాగా.. హైదరాబాద్‌ ఓటమిని వరుణుడే ఆపాలి!. ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 560 పరుగుల భారీ స్కోరు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -