ఐక్యరాజ్యసమితిపై ట్రంప్ విమర్శలు
కొత్త ఐక్యరాజ్యసమితిని నిర్మించాలనుకుంటున్నారు
బోర్డ్ ఆఫ్ పీస్‌పై బ్రెజిల్ అధ్యక్షుడు లులా విమర్శలు
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఐక్యరాజ్య సమితి(యూఎన్)పై విమర్శలు చేశారు. యూఎన్ ఇప్పటి వరకూ తన పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేదని చెప్పారు. ‘బోర్డ్ ఆఫ్ పీస్’తో కలిసి పని చేయడం ఐక్యరాజ్యసమితికి మంచి విషయమే అవుతుందని అన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశం అనంతరం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో జర్నలిస్టులతో మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితిపై విమర్శలు చేశారు. ఐక్యరాజ్యసమితికి గొప్ప సామర్థ్యం ఉన్నప్పటికీ అది ఆ స్థాయికి తగిన విధంగా పని చేయలేదని ఆయన అన్నారు. ”నేను ఎనిమిది యుద్ధాలను ఆపాను. కానీ ఆ ప్రక్రియలో ఐక్యరాజ్యసమితితో పెద్దగా సంప్రదింపులు జరపలేదు. అయినప్పటికీ, బోర్డ్ ఆప్ పీస్తో కలిసి పని చేయడం ద్వారా ఐక్యరాజ్యసమితికి ఒక కొత్త అవకాశమొస్తుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.
దావోస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ అధికారికంగా బోర్డ్ ఆఫ్ పీస్ చార్టర్‌ను ఆమోదించారు. ఈ బోర్డుకు ట్రంప్ చైర్మెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం గాజా ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వం, అభివృద్ధిని తీసుకురావడం అనే ఉద్దేశంతో స్థాపించారు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ చార్టర్‌కు అర్జెంటినా, ఆర్మేనియా, అజర్బైజాన్, బహ్రెయిన్, బల్గేరియా, హంగరీ, ఇండోనేషియా, జోర్డాన్, కజకిస్తాన్, కొసోవో, మంగోలియా, మొరాకో, పాకిస్తాన్, పరాగ్వే, ఖతర్, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈ, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలు సంతకాలు చేశాయి. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్, ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్… గాజా కోసం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్‌కు సంబంధించిన భద్రతా మండలి తీర్మానం 2803 అమలుకు యూఎన్ పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. గాజాలో మానవతా సహాయాన్ని అందించడంలో ఐక్యరాజ్య సమితి కీలక పాత్ర పోషిస్తోందని, కాల్పుల విరమణ అనంతరం సహాయం మరింత పెరిగిందని చెప్పారు.
యూఎన్ ఇప్పటికీ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించలేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



