Sunday, January 25, 2026
E-PAPER
Homeక్రైమ్మార్బుల్స్‌ రాళ్లు పడి ఇద్దరు మృతి

మార్బుల్స్‌ రాళ్లు పడి ఇద్దరు మృతి

- Advertisement -

– వాహనం నుంచి కిందకు దించుతుండగా ప్రమాదం
నవతెలంగాణ-గార్ల

ఇంటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన మార్బల్స్‌ రాళ్లను వాహనం నుంచి కిందకు దించుతుండగా ప్రమాదవశాత్తు రాళ్ల మధ్యలో ఇరుక్కొని ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ విషాద ఘటన శుక్రవారం రాత్రి మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని బంగ్లాతండాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాతండాలో ఇందిరమ్మ గృహానికి మార్బుల్స్‌ (రాళ్లు) ఖమ్మం నుంచి తీసుకొచ్చి ఇంటి దగ్గర బొలెరో నుంచి దింపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఆ రాళ్లు మీద పడి బోడా తరుణ్‌(25) అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం నెమలిపురికి చెందిన గుగులోత్‌ అవినాష్‌(27)ను 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్దారించారు. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఘటన స్థలాన్ని గార్ల-బయ్యారం సీఐ రవీందర్‌, ఎస్‌ఐ సాయికుమార్‌ సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -