- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, దేనికీ రాజీపడే ప్రసక్తే లేదని టీవీకే అధినేత విజయ్ అన్నారు. మహాబలిపురంలో నిర్వహించిన సభలో విజయ్ మాట్లాడారు. ఆ పార్టీకి ఈసీ విజిల్ గుర్తు కేటాయించాక నిర్వహించిన తొలి సభ ఇది. టీవీకేపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. తమిళనాడులో అవినీతి అంతానికి సమయం ఆసన్నమైందని చెప్పారు. డీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. అన్నాడీఎంకే ప్రత్యక్షంగా, డీఎంకే పరోక్షంగా భాజపాకు సరెండర్ అయ్యాయని విమర్శించారు.
- Advertisement -



