Sunday, January 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటు హక్కు ప్రాముఖ్యతపై భారీ ర్యాలీ

ఓటు హక్కు ప్రాముఖ్యతపై భారీ ర్యాలీ

- Advertisement -

నవతెలంగాణ – వర్ధన్నపేట
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట మండల కేంద్రంలో తహశీల్దారు విజయసాగర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై ఇంక శాఖల అధికారులు స్థానికులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద అధికారులు, విద్యార్థులు, ప్రజలతో కలిసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ విజయసాగర్ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకునే గొప్ప అవకాశం రాజ్యాంగం కల్పించిందన్నారు.ఔ


ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ, ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు సీనియర్ ఓటర్లను అధికారులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైనారిటీ విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుధీర్ బాబు, ఎస్ఐ సాయిబాబు, ఇతర శాఖల అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -