నవతెలంగాణ-నిజాంసాగర్
మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆదివారం ప్రారంభించారు. అనంతరం పార్టీ క్యాలెండర్, డైరీ ని పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడద్దని కష్టకాలంలో కూడా పార్టీ కార్యకర్తల అందరికీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, అచ్చంపేట్ మాజీ సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్ గౌడ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అచ్చంపేట్ లో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



