Sunday, January 25, 2026
E-PAPER
Homeజిల్లాలుజాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు

జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు

- Advertisement -

మాజీ పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ఒక ప్రకటనలో తాడిచెర్ల పీఏఎస్ మాజీ చైర్మన్ ఇప్ప మొండయ్య నేషనల్ ఓటరు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం వంటి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటు ఎంతో విలువైందన్నారు.1950, జనవరి 25న భారత ఎన్నికల సంఘం (ఈసిఐ) ఏర్పడిన సందర్భంగా ప్రతి ఏటా జనవరి 25న ఓటర్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు.

ఓటు హక్కుపై అవగాహన, కొత్తగా ఓటు హక్కు పొందిన యువతను ప్రోత్సహించడం మంచిదన్నారు. నైతిక ఓటింగ్ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, బాధ్యతగా ఓటు వేస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య బలోపేతం, మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకునే శక్తి ఓటుకు ఉందని గుర్తు చేశారు. ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా అని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు గర్తుచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -