- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం మండలంలోని ఆయా గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓటు హక్కు పై అవగాహన కల్పించి విద్యార్థుల చేత ఓటు హక్కు పై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నూతన ఓటర్లు మరియు గత 40 సంవత్సరాల నుండి ఓటు హక్కును వినియోగించుకుంటున్నా ఓటర్లను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ నిర్మలాదేవి, ఆర్ ఐ పాండురంగారెడ్డి, జహురుద్దీన్, శ్రీను నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



