Sunday, May 25, 2025
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయులే భావి సమాజ నిర్మాతలు.!

ఉపాధ్యాయులే భావి సమాజ నిర్మాతలు.!

- Advertisement -

ముగిసిన శిక్షణా శిబిరం..
మండల విద్యాధికారి లక్ష్మన్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
: ఉపాధ్యాయులే భావి సమాజ నిర్మాతలని మండల విద్యాధికారి లక్ష్మన్ బాబు అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆదేశాలతో మండలంలోని వళ్లెంకుంట జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మండల స్థాయి ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు 20 నుంచి 24 వరకు ఐదు రోజులపాటు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. శనివారం శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసిందన్నారు. శిక్షణ శిబిరం ముగింపు సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులందరూ కూడా శిక్షణ ఇచ్చిన ఆర్పీలు చెప్పిన ప్రతి అంశాన్ని శ్రద్ధగా విని ఈ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క  టీచర్స్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ శిక్షణలో ఆర్పీలుగా పనిచేసిన మధుసూదన్, చంద్రశేఖర్, సాంబయ్య, రామకృష్ణ, రాకేష్, మహిపాల్, శాంతిలత, హరీష్ అందరూ ఈ ఐదు రోజులు శిక్షణను 100% విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా  టీచర్స్ నేర్చుకున్న విషయాలను తమ తమ పాఠశాలలో అమలుపరిచి విద్యార్థిని విద్యార్థుల  విద్యాభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ శిక్షణ ద్వారా తాము ఎన్నో  తెలియని విషయాలను నేర్చుకున్నామని, వాటిని పాఠశాలల్లో అమలు పరుస్తామని  ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు, సిఆర్పీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -