Sunday, January 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐకేపీలో డుమ్మాలకు చెక్క్.!

ఐకేపీలో డుమ్మాలకు చెక్క్.!

- Advertisement -

ఆన్లైన్లో ముఖ గుర్తింపు హాజరు
అమలులో కొత్త విధానం
నవతెలంగాణ – మల్హర్ రావు

ఐకెపిలో డుమ్మాలు కొట్టే ఉద్యోగులకు, సిబ్బందికి చెక్ పెట్టడానికి రాష్ట్ర సెర్ప్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హాజరు రిజిస్ట్రేషన్లు స్వప్తి చెప్పి ఆన్లైన్ హాజరు విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు టిపేస్ఏప్ఆర్ఎస్ లను అమల్లోకి తెచ్చింది.దీన్ని ఏవిధంగా ఉపయోగించాలో ఇప్పటికే ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఐకెపి విభాగంలో అన్ని కెడర్ల ఉద్యోగులకు ఈ యాప్ ద్వారా ఏప్ఆర్ఎస్ చేసుకోవడానికి వీలు కనిపించారు.

ఇది వరకు జిల్లా మండల కార్యాలయాలు హాజరు రిజిస్ట్రేషన్ ద్వారా అటెండెన్స్ నమోదు చేసుకునేవారు. దీనిద్వారా చాలామంది ఉద్యోగులు ఇంటి పట్టున ఉంటూ అధికారులకు మెసేజ్ చేస్తూ హాజరు చేసుకునే జీతాలు తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆఫీసులకు రాకుండా సొంత పనులు చేసుకోవడంపై సెర్స్ కు ఫిర్యాదులు వెళ్లాయి.ఉద్యోగులకు క్రమశిక్షణలో పెట్టేందుకు సెర్ఫ్ ఉన్నత అధికారులు ఆన్లైన్లో ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని తెచ్చారు.యాప్ ను ఉద్యోగులు మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత హాజరు చేసుకోవాలి. ఉదయం 10:30 గంటలకు ఒకసారి లాగిన్ అయి ఎక్కడ ఉన్నారో లొకేషన్లో పెట్టాలి.

మళ్లీ సాయంత్రం ఐదు గంటలకు ఒకసారి విధులు ముగించుకున్నట్టుగా నమోదు చేయాలి. సెలవులు సైతం ఈ యాప్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగుల హాజరు పర్యవేక్షించడానికి జిల్లా అధికారి లాగిన్ ఇచ్చినట్లు సమాచారం. మండలానికి సంబంధించి ఏపీఎంకు ఈ యాప్లో లాగిన్ ఉంటుంది. ఎవరు విధుల్లో చేరారు. ప్రతి సమాచారం ఏపీఎం వద్ద ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -