నరసింహ మృతి సీఐటీయూకు తీరంలోటు ..
నరసింహకు సంతాపం తెలిపిన వివిధ పార్టీల నాయకులు , గ్రామ ప్రజలు..
నవతెలంగాణ – మునుగోడు..
మునుగోడు మండలంలోని కొరటికల్ గ్రామపంచాయతీ కార్మికుడు దండు నరసింహ (60) గత పది రోజుల నుండి అనారోగ్యానికి గురై ఆదివారం మృతి చెందారు. నరసింహ గ్రామపంచాయతీ కార్మికుడిగా గత 20 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తూ గ్రామ అభివృద్ధికి తను చేసిన సేవలను గ్రామ ప్రజలు కొనియాడారు. అనారోగ్య సమస్యతో నరసింహ మృతి చెందడం బాధాకరమని గ్రామ సర్పంచ్ అద్దంకి రామలింగయ్య అన్నారు.
నరసింహ మృతి సీఐటీయూకు తీరని లోటు..
కొరటికల్ గ్రామపంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్న దండు నరసింహ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని సీఐటీయూ మండల కన్వీనర్ వరుకుప్పల ముత్యాలు అన్నారు. గత 20 సంవత్సరాల నుండి గ్రామపంచాయతీ కార్మికుల హక్కుల సాధన కోసం సీఐటీయూ చేసిన అనేక పోరాటాలలో నరసింహ కీలక పాత్ర పోషించేవారని అన్నారు. సీఐటీయూ బలోపేతం కోసం నరసింహ చేసిన కృషి శిరస్మరణీయమని కొనియాడారు . నరసింహ కుటుంబానికి సీఐటీయూ సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
నరసింహకు సంతాపం తెలిపిన వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు
గ్రామ ఉప సర్పంచ్ మందుల అంజయ్య, గ్రామ కార్యదర్శి శ్రీను, వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందుల సత్యం, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు దొండ వెంకన్న, సిపిఐ మండల సహాయ కార్యదర్శి మందుల పాండు, కాంగ్రెస్ మండల నాయకులు మందుల బీరప్ప, మాజీ సర్పంచ్ వల్లూరి పద్మ లింగయ్య, మాజీ ఉపసర్పంచ్ ఎల్లంకి యాదగిరి, యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మందుల సైదులు, గ్రామ ప్రజలు సంతాపం తెలిపారు.



