Sunday, January 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బురదామయం లేని గ్రామాలుగా అభివృద్ధి పరచడమే లక్ష్యం 

బురదామయం లేని గ్రామాలుగా అభివృద్ధి పరచడమే లక్ష్యం 

- Advertisement -

రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని నల్లగుట్ట తండా గ్రామపంచాయతీలో బురదమయం లేని రోడ్లు ఉండాలని సీసీ రోడ్డు పనులను ప్రారంభించినట్లు డాక్టర్ భూక్య మురళి నాయక్ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా డాక్టర్ మురళి నాయక్ తెలిపారు. ఆదివారం ఆ గ్రామ సర్పంచ్ గుగులోతు హేమలత శ్రీను ఈజీఎస్ నిధులతో ఐదు లక్షలతో సిసి రోడ్డు పనులు ప్రారంభించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక కోట్లాదినిధులు నియోజకవర్గాన్ని తీసుకొచ్చి అన్ని రంగాలు అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు.

అంతేకాకుండా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి అందే విధంగా కృషి చేస్తుందని అన్నారు. ఈ గ్రామంలో కాకుండా మండలంలో ఏ వాడలో కూడా బురదమయంగా ఉండవద్దని ఉద్దేశంతో ఈ సీసీ రోడ్డు పనులను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు న్యాయని సత్యపాల్ రెడ్డి, సర్పంచులు గుగులోతు హేమలత, శీను ఈట్టే లీల దేవేందర్ రెడ్డి, భూక్య వీరన్న, సోమన్న, అశోక్, ధనమ్మ నాయక్, ఉపసర్పంచ్ లక్ష్మణ్, నాయకులు బాలాజీ నాయక్ ,రాజు నాయక్, ఆకుతోట సతీష్, మంగు, శ్రీనివాస్ ,వెంకన్న, తోపాటు కొంతమంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -