Sunday, May 25, 2025
Homeఖమ్మంఅనాధల ఆత్మ శాంతి కోసం ..

అనాధల ఆత్మ శాంతి కోసం ..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ చేసే సేవా కార్యక్రమాల్లో ప్రధానంగా కనబతుండేది మానవత్వం, మంచితనం, కరుణతత్వమే. అది వాస్తవ రూపంలో నిరూపిస్తుంది. రోడ్లపై దిక్కులేని అనాధ శవాలుగా తనువు చాలించి మరణిస్తున్నారు. వారూ మనలాంటి మనుషులేనని భాద్యతగా భావించి అంతిమ సంస్కారాలను నిర్వహిస్తుంది ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ. ఇప్పటి వరకు 133 అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు. అయా మత సంప్రదాయాల ప్రకారం మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అనాధ శవానికి సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే సర్వం సిద్ధం చేస్తారు. అది వారి భాద్యతగా భావిస్తుంటారు. ఈ మేరకు శనివారం ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ చనిపోయిన అనాధ శవాలకి కాశీలోని మణికర్ణికా ఘాట్ వద్ద కర్మకాండలను నిర్వహించారు. మనిషికి మనిషి భారమౌతున్న నేటి రోజుల్లో మానవత్వమే నిజమైన దైవత్వంగా భావిస్తు ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అందరీకి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, ఐలేని సంతోష్, ఇందూరు శేఖర్, విజ్ఞేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -