మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్
నవతెలంగాణ – నెల్లికుదురు
మనలను కన్న తల్లిదండ్రుల విగ్రహాలను పెట్టి పూజించడం ఎంతో సంతోషకరమైనదని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ తెలిపారు. ఆదివారం నల్లగుట్ట తండా శివారు జాదుతాండా కు చెందిన నల్లగుట్ట తండా ఉపసర్పంచ్ లక్ష్మణ్ వారి సోదరుడు బిక్షపతి కలిసి తల్లిదండ్రుల విగ్రహాల ఏర్పాటుచేసిన ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కన్నా తల్లిదండ్రులను వారు చేసిన కష్టా సుఖాలను సుఖాలను గుర్తుపెట్టుకొని మనకోసం వారు పడిన కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని వారి విగ్రహాలను ఏర్పాటు చేసి ఈరోజు ఆవిష్కరించి వారికి ప్రత్యేక పూజలు చేయడం హర్షించే తగ్గ విషయమని అన్నారు.
వారి విగ్రహాలను ఈరోజు ఏర్పాటు చేయడం పట్ల వారిని అభినందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, ఆ గ్రామ సర్పంచ్ గుగులోతు హేమలత శీను, వివిధ గ్రామాల సర్పంచులు అశోక్, లీల, ధనమ్మ,, సోమన్న, అశోక్, నాయకులు నాయిని సత్యపాల్ రెడ్డి, గుగులోతు బాలాజీ నాయక్, మది రాజేష్, ఆకుతోట సతీష్, గుదే యుగేందర్, అశోక్, సురేష్, రాజు నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు గ్రామ శాఖ అధ్యక్షులు ఆ పార్టీ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.



