నవతెలంగాణ – ఆలేర్ రూరల్
శాలివాహనాలు ( కుమ్మరులు ) రాజకీయంగా,సామాజికంగా,ఆర్థికంగా ఎదగాలని సంఘం మండల అధ్యక్షుడు గంగదారి సుదీర్కుమార్ అన్నారు. ఆదివారం ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో శాలివాహన సంఘం ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుమ్మర్లు విద్య, వైద్య రంగాల్లో పోటీ పడి ఎదుగుతున్న స్ఫూర్తితో అన్ని రాజకీయ పార్టీలో బలమైన శక్తిగా ఎదగాలని అన్నారు. కుమ్మర్ల ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించుకోవాలని అన్నారు.సంఘం ఐక్యంగా ఉంటేనే మన హక్కుల సాధించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి సత్యనారాయణ,ఉపాధ్యక్షులు శనిగరం హరీష్, కోశాధికారి కొరుటూరి బిక్షపతి, ఇస్తారి, బాలరాజు, నరసింహులు, ఉపేందర్, సత్తయ్య, సిద్ధులు, శ్రావణ్, రాజు, పరమేష్, సతీష్, సాగర్, గణేష్, భాస్కర్, ఆంజనేయులు, సాయికిరణ్, శ్రీనివాస్, బాలస్వామి, రవి, రవీందర్ సంఘం నాయకులు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శాలివాహనులు రాజకీయంగా ఎదగాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



