– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ప్రసాదరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ తరం సీపీఐ(ఎం) నాయకుల్లో అలుపెరుగని మార్క్సిజం ఆశయ సాధకుడు కామ్రేడ్ కాసాని ఐలయ్య అని సీపీఐ(ఎం) అశ్వారావుపేట మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ అన్నారు. ఆదివారం మండలంలోని నందిపాడు లో కామ్రేడ్ కాసాని ఐలయ్య ప్రధమ వర్ధంతి ని నిర్వహించారు.
ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతు గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ కార్యకరైతలతో సైతం మాస్ లీడర్ గా పేరుపొందిన ఈ తరం మార్క్సిస్ట్ ఐలయ్య అని ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నందిపాడు సర్పంచ్ కూరం దుర్గమ్మ,స్థానిక నాయకులు కారం వీరస్వామి, మండల కమిటీ సభ్యులు వెట్టి కుమారి,సవలం సీతయ్య, మడకం నాగేశ్వరావు,కారం సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.



