Sunday, January 25, 2026
E-PAPER
Homeఖమ్మంఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

- Advertisement -

– ముగ్గుల పోటీలు నిర్వహణ
నవతెలంగాణ – అశ్వారావుపేట

జాతీయ 16 వ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేట లో ఆదివారం రెవెన్యూ శాఖ ఎలక్షన్ విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ తో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముందుగా పట్టణంలోని మూడు రహదారుల ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించి ఓటు హక్కు ప్రాముఖ్యత పై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, బీఎల్ఓ లకు తహశీల్దార్ సీహెచ్‌వీ రామకృష్ణ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

ముగ్గుల పోటీల విజేతల వివరాలను ఎలక్షన్ విభాగం డీటీ హుస్సేన్ వెల్లడించారు. ప్రథమ స్థానం మైనారిటీ కళాశాల బైపీసీ విద్యార్థినులు ఎస్‌కే చాంద్‌బీ, పి. సాయి మణి కి దక్కింది. ద్వితీయ స్థానం మైనారిటీ బాలికల పాఠశాల 9 వ తరగతి విద్యార్థినులు జి. శ్రావణి, సీహెచ్ సాయి భవానీ సాధించారు. తృతీయ స్థానం వై. తేజశ్రీ, ఎస్‌కే రేఖీయా భాను కు లభించింది. బీఎల్ఓ ల విభాగంలో ప్రథమ స్థానం కే. రాధ, వీ. నాగమణి లకు దక్క గా, ద్వితీయ స్థానం ఎన్. ఉషా దేవి సాధించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రసాదరావు, ఎస్‌ఐ కే. అఖిల, సీఆర్పీ ప్రభాకరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -