Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలలో రిపబ్లిక్ డే క్రీడలు

పాఠశాలలో రిపబ్లిక్ డే క్రీడలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వేల్పూర్ మండలంలోని ఆయా ప్రభుత్వ, ప్రైవేటు  పాఠశాలల్లో రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని ఆదివారం విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించారు. అందులో భాగంగా రామన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలను నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సోమవారం రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరణ అనంతరం బహుమతులను ప్రధానం చేయనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివాజీ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మనోహర్, శ్రీకాంత్, వేణు, గణేష్, శ్యాం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -