Monday, January 26, 2026
E-PAPER
Homeక్రైమ్పోలీసుల అదుపులో నిందితులు 

పోలీసుల అదుపులో నిందితులు 

- Advertisement -

మైలారిగూడెం హత్య కేసులో నిందితులు
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 

ఈనెల 23న సాయంత్రం 07.00 గంటల సమయంలో హరి హర కాటేజ్, మైలరిగూడెం గ్రామము నందు యాదగిరిగుట్ట గ్రామానికి చెందిన ఠాకూర్ నిశాంత్ సింగ్  (33) సంవత్సరాలు హత్యకు గురయ్యారు. ఈ విషయంలో మృతుడి అక్క ఠాకూర్ దీపిక 24న పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నమ్మదగిన సమాచారంతో నిందితులు వనగంటి ఉపేందర్(30) నల్లపోచమ్మవాడ, యాదగిరిగుట్ట పట్టణం, యాదాద్రి-భువనగిరి జిల్లా, ఆకుల బాల మల్లేష్ (33) యాదగిరిపల్లి, యాదగిరిగుట్ట పట్టణం, యాదాద్రి-భువనగిరి జిల్లాలను యాదగిరిగుట్ట సన్నిది హోటల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెల్లంకొండ సాయి కుమార్ (25) మైలారిగూడెం గ్రామం, యాదగిరిగుట్ట మండలం, యాదాద్రి- భువనగిరి జిల్లా ను మైలారిగూడెం గ్రామం లోని అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకొని ముగ్గురిని విచారించి రిమాండ్ కి తరలించారు. మిగితా వ్యక్తులు పరారిలో ఉన్నారు. ఈ కేసులో హోండా యాక్టివా  స్కూటీ, హత్యకు ఉపయోగించిన రెండు కత్తులను మరియు రెండు స్మార్ట్ మొబైల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -