..
స్వర్ణగిరి క్షేత్రంలో ఘనంగా దివ్య విమాన రథోత్సవం
భక్తుల గోవింద నామాలతో మారుమోగిన మానేపల్లి హిల్స్
నవతెలంగాణ యాదాద్రి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన యాదాద్రి తిరుమల స్వర్ణగిరి దేవస్థానంలో ఆదివారం రోజు సప్త వాహనాలపై శ్రీదేవి భూదేవి సమేతంగా ఊరేగిన శ్రీనివాసుడు. స్వర్ణగిరి దేవస్థానంలో రథ సప్తమి వేడుకలలో భాగంగా నేటి ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని సప్త వాహనాలు సూర్య ప్రభా వాహనం , చిన్న శేష వాహనం , గజవాహనం , హనుమంత వాహనం , కల్పవృక్ష వాహనం , చంద్ర ప్రభావాహనం , గరుడ వాహనాలపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణగిరి శ్రీనివాసుడు ఆలయ పురవీధులలో వందలాది మంది భక్తుల గోవిందా నామాలను పటిస్తూ స్వామివారి పల్లకి సేవను మోసేందుకు అత్యంత ఉత్సాహాన్ని కనబరిచారు.
రథసప్తమి వేడుకలలో చిన్నపిల్లలు కూచిపూడి భరతనాట్యం వంటి కార్యక్రమాలరతో ఆలయానికి విచ్చేసిన భక్తులను అలరించారు. మధ్యాహ్నం స్వామివారి నిత్యాన్న ప్రసాద కార్యక్రమంలో భాగంగా నేడు సుమారు 3000 మందికి పైగా భక్తులు స్వామివారి నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రాత్రి 8 గంటలకు స్వర్ణగిరి శ్రీనివాసుని దివ్య విమాన రథోత్సవం పై అధిరోహింప జేసి ఆలయ మాడవీధులలో శోభాయమానంగా ఊరేగించారు.


