– 10 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది
నవతెలంగాణ – హైదరాబాద్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని చేధించింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల టార్గెట్‌ని టీమ్ఇండియా 10 ఓవర్లలోనే 2 వికెట్లే కోల్పోయి ఛేదించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే భారత్ 3-0తో కైవసం చేసుకుంది. అభిషేక్ శర్మ (68*; 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సూర్యకుమార్ యాదవ్ (57*; 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. ఇషాన్ కిషన్ (28; 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంత సేపు షాట్లతో విరుచుకుపడ్డాడు. నాలుగో టీ20 బుధవారం (జనవరి 28) విశాఖపట్నంలో జరగనుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (48; 40 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మార్క్ చాప్‌మన్ (32), శాంట్నర్ (27) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 3, రవి బిష్ణోయ్ 2, హార్దిక్ పాండ్య 2, హర్షిత్ రాణా ఒక వికెట్ పడగొట్టారు.

