సంఘం జెండాను ఆవిష్కరించిన ఐద్వా జాతీయ అధ్యక్షులు పీకే శ్రీమతి
యోధుల్ని యాదిజేస్తూ కళాకారుల గీతాలాపణ
(సరోజినీ బాలానందన్ నగర్ హైదరాబాద్)
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) 14వ అఖిల భారత మహాసభలు హైదరాబాద్ లోని ఆర్టీసీ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఆదివారం అత్యంత ఉత్సాహ పూరితంగా ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభ సూచికగా ఐద్వా అఖిల భారత అధ్యక్షులు పీకే శ్రీమతి సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భరగా 14వ మహాసభ సూచనగా.. 14 బెలూన్లు ఎగిరేశారు. ‘అన్యాయం అక్రమం అంతం చేస్తూ దౌర్జన్యం దుర్మార్గం ధనుమాడిస్తూ స్త్రీలకు ధైర్యశక్తి అందించేది అఖిల భారత మహిళా సంఘటిత సంఘం. ఎత్తరా ఐద్వా జెండా’ అంటూ ప్రజానాట్యమండలి కళాకారులు గీతాన్ని ఆలపించారు.. అనంతరం ప్రతినిధులంతా ఒకరి తరువాత ఒకరిగా అమరవీరుల స్థూపం వద్ద రెడ్ సెల్యూట్ చేస్తూ నివాళులర్పించారు.
‘వీరులారా… ఓ అమరులారా… అంటూ మహిళా, ప్రజా పోరాట యోధులను గుర్తు చేసుకుంటూ పాడిన పాట ఉత్కంఠను నింపింది. ‘అమరులకు జోహార్లు’ ‘ఐద్వా జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ ‘అన్న నినాదాలతో మహాసభ ప్రాంగణం మారుమ్రోగింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రతినిధులతో మహాసభ ప్రాంగణం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో ఐద్వా అఖిల భారత ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, కోశాధికారి ఎస్ పుణ్యవతి, ఆఫీస్ బేరర్స్, ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఆర్ అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి, కార్యక్రమంలో అగ్ర భాగాన నిలిచారు.



