ఐదుగురికి పద్మ విభూషణ్,13 మందికి పద్మ భూషణ్,113 పద్మ శ్రీ అవార్డులు
ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్‌కు పద్మ విభూషణ్
ఈ ఐదు అవార్డుల్లో మూడు కేరళకే
తెలుగు రాష్ట్రాలకు 11 పద్మ శ్రీ అవార్డులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఆదివారం ప్రకటించిన 131 పద్మ అవార్డుల్లో ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. పద్మశ్రీ దక్కిన వారిలో 11 మంది తెలుగువారు ఉన్నారు. అందులో తెలంగాణకు చెందిన వారు ఏడుగురు కాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు నలుగురు ఉన్నారు. అదే విధంగా కేరళకు అత్యున్నతమైన పద్మ అవార్డులను అత్యధికంగా కేటాయించింది. ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించగా, అందులో ముగ్గురు కేరళకు చెందిన వారే ఉన్నారు.
సీపీఐ(ఎం) నేత, మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్(మరణానంతరం)కు, కేటీ థామస్, పీ. నారాయణ్‌కు పద్మ విభూషన్ అవార్డులను ప్రకటించింది. నటుడు ధర్మేంద్రకు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. జెఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్, బీజేపీ నాయకుడు వికె మల్హోత్రా (మరణానంతరం)కు, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం భగత్ సింగ్ కోష్యారీ, నటుడు మమ్ముట్టి, బ్యాంకర్ ఉదయ్ కోటక్‌లకు పద్మభూషణ్ అవార్డు లభించింది. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, క్రికెటర్ రోహిత్ శర్మ, నటులు ఆర్ మాధవన్, ప్రోసెంజిత్ ఛటర్జీకి పద్మశ్రీ అవార్డు లభించింది.
‘పద్మశ్రీ ‘ కి ఎంపికైన వారు
తెలంగాణలో…చంద్రమౌళి గద్దమనుగు, దీపికా రెడ్డి , గూడూరు వెంకట్ రావు, కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్, కుమారస్వామి తంగరాజ్ , పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి, రామారెడ్డి మామిడి
ఆంధ్రప్రదేశ్‌లో…గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, మాగంటి మురళీమోహన్ , వెంపటి కుటుంబ శాస్త్రి .
విరిసిన పద్మాలు
- Advertisement -
- Advertisement -



