నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం మంతపురి గ్రామానికి చెందిన బండారి ప్రసాద్ ముదిరాజ్ కి నిస్వార్థ సేవలకు గుర్తింపుగా భారత్ సేవారత్న నేషనల్ అవార్డు ప్రకటించారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నిరుపేద కుటుంబాల విద్యార్థులకు కేంద్ర,రాష్ట్ర పోలీసు బలగాలకు సంబంధించిన ఉద్యోగాల కోసం వాట్సాప్ మాధ్యమం ద్వారా ఉచితంగా శిక్షణ, పుస్తకాలు అందిస్తూ అనేక మందిని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దుతున్నారు.
ఈ సేవలను గుర్తించిన ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ వారు సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ (సైనిక గ్రూప్) ఫౌండర్ జనరల్ సెక్రటరీ అయిన బండారి ప్రసాద్ ముదిరాజ్ కి భారత్ సేవారత్న నేషనల్ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, సైనిక గ్రూప్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ.. ఆయన సేవలు భవిష్యత్తులో దేశం నలుమూలలా విస్తరించాలని కొనియాడారు.
నిస్వార్థ సేవకు గుర్తింపుగా భారత్ సేవారత్న నేషనల్ అవార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



