నవతెలంగాణ – చండూరు
77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చండూర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు గుర్రం బిక్షమయ్యజాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం మార్కండేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..గణతంత్ర దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగం స్వేచ్ఛతో పాటు ప్రతి పౌరుడికి న్యాయం, సమానత్వం, గౌరవం కల్పించిందని గుర్తుచేస్తూ, ప్రజాస్వామిక, గణతంత్ర, లౌకిక, సామ్యవాద, సార్వభౌమ దేశంగా భారతదేశం ప్రగతి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు.
రాజ్యాంగ నిర్మాతల దార్శనికతకు, గణతంత్రాన్ని తీర్చిదిద్దిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ, యోధుల ఆకాంక్షలకు అనుగుణంగా దేశ సేవకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు పులిపాటి ప్రసన్న, గౌరవ సలహాదారు కోడి గిరిబాబు, ట్రస్ట్ చైర్మన్ కోమటి వీరేశం, దేవాలయల చైర్మన్ రావి రాల నగేష్ ,పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు పున్న ధర్మేంద్ర, జూలూరు ఆంజనేయులు, కార్యదర్శి గంజి శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి కర్నాటి మార్కండేయ, చెరుపల్లి అంజయ్య, ప్రచార కార్యదర్శి చిట్టిప్రోలు వెంకటేశం, కార్యవర్గ సభ్యులు రావిరాల శ్రీను ,కర్నాటి శ్రీను, రాపోలు సత్తయ్య, కోమటి ఓంకారం, తిరందాసు గోపాల్, చేనేత కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు తిరందాసు శ్రీను, అధ్యక్షులు రాపోలు వెంకటేశం, జూలూరు వెంకటేశం, కర్నాటి శ్రీను ,గుర్రం రాము, సిపిఎస్ అధ్యక్షులు చెరుపెల్లి కృష్ణ, మార్కండేయ యువజన సంఘం అధ్యక్షులు గంజి గంగాధర్, గంజి బిక్షం, చిలువేరు చిరంజీవి, తిరందాసు భాస్కర్ , బొల్ల శ్రీకాంత్ , తిరందాసు అంజయ్య, ఏలే సూరయ్య, పాలాది అంజయ్య, ఏలె మారయ్య, గుర్రం శేఖర్, కుల బాంధవులు పాల్గొన్నారు.



