నవతెలంగాణ – బజార్ హాత్నూర్
భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా మండల పరిధి 31 గ్రామాల్లో వాడవాడల్లో పాఠశాలలో, కళాశాలలో, సచివాలయాలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు వద్ద ఆయా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక గ్రామపంచాయతిలో సర్పంచ్ పరచ సాయన్న, ప్రాథమిక సహకార సంఘంలో సిఈఓ నారాయణ గౌడ్, పశు వైద్యశాలలో డాక్టర్ పార్విద్ హైమద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ భీమ్ రావు, వ్యవసాయ కార్యాలయంలో ఏవో మొహమ్మద్ సౌద్, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో శ్రీనివాస్, తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ శ్యాంసుందర్ లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశస్వాతంత్రం కోసం మహాత్మ గాంధీ ఆధ్వర్యంలో అహింసా మార్గంలో పయనించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని రావడం జరిగిందని కొనియాడారు. ఈ స్వాతంత్రం ఉద్యమంలో మహనీయులతోపాటు అనేక లక్షల మంది ప్రజల త్యాగం ఉన్నదన్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. అంతేకాకుండా మండల కేంద్రంలోని కురుక్షేత్ర స్కూల్, శ్రీ సరస్వతీ శిశు మందిర్, శ్రీ వెంకటేశ్వర పాఠశాల విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



