Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఐటీయూ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

సీఐటీయూ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పొట్టి శ్రీరాములు హమాలి సంఘం, మాయాబజార్ హమాలి సంఘం ఆధ్వర్యంలో ( సీఐటీయూ ) గణతంత్ర దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సుభాష్ టాకీస్ వద్ద రెండు హమాలి సంఘాల కార్యాలయాల వద్ద తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ ( సీఐటీయూ ) జిల్లా అధ్యక్షులు కందరపు రాజనర్సు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కర్రల సత్యం, రెండు హమాలి సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, హమాలి యూనియన్ నాయకులు  సుమారు 100 మంది హమాలి సంఘం,సీఐటీయూ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -