Monday, January 26, 2026
E-PAPER
Homeజిల్లాలుజూనియర్ అసిస్టెంట్ కు జిల్లా ఉత్తమ అవార్డు

జూనియర్ అసిస్టెంట్ కు జిల్లా ఉత్తమ అవార్డు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా పని చేస్తున్న దొంతిరెడ్డి పంకజ్ రెడ్డి జిల్లా ఉత్తమ అవార్డు లభించింది. కార్యాలయ పనులు ఎటువంటి పెండింగ్ లేకుండా, ఎన్నికల విధులను విజవంతంగా పూర్తి చేసినందుకు గాను 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ఫవార్ చేతులమీదుగా సోమవారం అవార్డు అందుకున్నారు. ఉత్తమ అవార్డు  కలెక్టర్ చేతులమీదుగా అందుకున్నందుకు పెద్దవూర మండలపరిషత్  అభివృద్ధి అధికారి ఉమాదేవి, కార్యాలయ సిబ్బంది  పంకజ్ రెడ్డిని అభినందనలు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -