నవతెలంగాణ – కామారెడ్డి, బిబిపేట్
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నక్షత్ర అనే విద్యార్థిని ఇస్రో సందర్శనకు ఎంపికైన సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఘనంగా సన్మానించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు సారయ్య ఆధ్వర్యంలో జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్, సర్పంచ్ హరీష్ యాదవ్ లు కలిసి విద్యార్థినిని శాలువాతో అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా వైస్ చైర్మన్ నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ ప్రతిభ కలిగిన విద్యార్థులకు రెడ్ క్రాస్ సొసైటీ ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల ఉత్పత్తిదారుల జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, ఉపసర్పంచ్ సంతోష్ రెడ్డి, వార్డు సభ్యులు నర్సింలు, రవి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇస్రో సందర్శనకు ఎంపికైన విద్యార్థినికి సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



