- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవనంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు వందనం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం. నాగరాజు, సహాధ్యక్షులు ఎం. చక్రధర్, కోశాధికారి ఎం. దేవరాజు పాల్గొన్నారు. కేంద్ర సంఘం, జిల్లా కార్యవర్గ సభ్యులు, అర్బన్ తాలూకా, వివిధ ఫోరమ్ నాయకులు హాజరయ్యారు.
- Advertisement -



