- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ భవన్ వద్ద జాతీయ జెండాను డీసీసీ మాజీ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విలువల రక్షణే ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. యువత రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని, ప్రజాస్వామ్య విలువలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, గొడుగుల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



