Monday, January 26, 2026
E-PAPER
Homeజిల్లాలుసమాచార హక్కు చట్టం.. సామాన్యుడి వజ్రాయుధం.!

సమాచార హక్కు చట్టం.. సామాన్యుడి వజ్రాయుధం.!

- Advertisement -

ఆర్టిఐ క్యాలెండర్ ఆవిష్కరణలో కాటారం డిఎస్పీ సూర్యనారాయణ
నవతెలంగాణ – కాటారం

సామాన్యుడుకి చేతిలో సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధమని కాటారం డిఎస్పీ సూర్యనారాయణ అన్నారు. యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ క్యాలెండర్ 2026ను మణుగూరు డిఎస్పీ రవిందర్ రెడ్డితో కలిసి సోమవారం కాటారం డిఎస్పీ కార్యాలయంలో  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పాలనలో పారదర్శకత, జవాబుదారితనం ఉండాలని, అవినీతి నిర్మూలనకు దోహద పడుతుందని, సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ  కాటారం సబ్ డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్, జిల్లా సభ్యుడు ముక్కెర వెంకటస్వామి గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -