Monday, January 26, 2026
E-PAPER
Homeఖమ్మంజాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జారె

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జారె

- Advertisement -

– రాజ్యాంగమే ప్రజాస్వామ్యానికి జీవం
– విద్యా వైద్యం వ్యవసాయం అభివృద్ధి తోనే సమసమాజం పురోభివృద్ధి
– గణతంత్ర దినోత్సవం లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట

ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయడం,దాన్ని రక్షించుకోవడం ఒక్కటే మార్గమని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని తన అధికారిక నివాసం అయిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో పోలీసులు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా రూ. 50 లక్షల నిధులతో నిర్మించబోయే పబ్లిక్ టాయిలెట్ల కు ఆయన శంకుస్థాపన చేసారు.

వ్యవసాయ కళాశాల తో పాటు పలు చోట్ల,రైతు వేదికలో వ్యవసాయ ఆద్వర్యంలో చేపట్టిన యంత్రాలు పంపిణీ కి ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన రైతులకు పనిముట్లు ను అందించిన తర్వాత ఏర్పాటు చేసిన సహాయ సంచాలకులు అద్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేసారు.

భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని,ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉండాలంటే ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను పాటించాలని, స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులు త్యాగాలను స్మరించుకుంటూ,వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని  పేర్కొన్నారు. విద్యా వైద్యం వ్యవసాయం అభివృద్ధి చెందితేనే సమాజం పురోభివృద్ధి చెందుతుందని,ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణను చేపట్టిందని అన్నారు.

ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసి అదనపు ఖర్చులు తగ్గించుకోవడం కోసం ప్రభుత్వం రాయితీ పై రైతులకు వ్యవసాయ యంత్ర సామాగ్రి అందిస్తుందని అన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి  ఖర్చు తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సబ్సిడీ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్ల సౌకర్యం కల్పించేందుకు టాయిలెట్ లు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.

ప్రకృతి సాగు విధానంలో సేంద్రీయ పంపులు పండిస్తున్న జయరాజు,దుర్గారావు లను,సేంద్రీయ సాగు ను ప్రోత్సహిస్తున్న చంద్రశేఖర్ లను రైతు సంఘం నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య తో కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ(బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు,తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ,ఎంపీడీఓ అప్పారావు,ఏవో పర్సా శ్రీనివాసరావు,కాంగ్రెస్ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు,కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్,సీపీఐ(ఎం ) నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -