Monday, May 18, 2026
E-PAPER
Homeదర్వాజప్రపంచ జేబుదొంగ

ప్రపంచ జేబుదొంగ

- Advertisement -

నిన్ను ఇన్నాళ్లు
ప్రపంచ పోలీసువే అనుకున్నా.
ఎవరూ ఇవ్వని టోపీ తగిలించుకుని
నీకు నువ్వే జగద్రక్షకభటునిగా
విశ్వవీథిలో వీరంగం వేయడం
పారంపర్య లక్షణమే
అనుకున్నా.
ఇవాళ హోర్ముజ్ జలసంధిలో
పీకలదాకా మునిగి
సరికొత్తగా సముద్రదొంగగా తేలావు.
ఇప్పటికైనా దొంగనని చెప్పుకున్నందుకు,
అసలు నిజాన్ని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు.
ఒక దేశాధ్యక్షుడిని బంధించావు
ఇంకో దేశపు మహానేతను అంతమొందించావు.
పొద్దున్నే అమ్మలు సర్దిన
టిఫిన్ బాక్సులు, బ్యాగులతో
బడికివెళ్లిన అమ్మాయిలు మళ్లీ తిరిగి రానేలేదు.
క్షిపణి కాళ్లతో తొక్కి మట్టి తలుపులూ తాళాలేసి
శాశ్వతంగా బంధించి మహా హంతకునిగా మారావు
ఇవాళ నువ్వు చెప్పుకుంటున్న సముద్ర దొంగవే కాదు
యావత్ప్రపంచ పౌరుల జేబుదొంగగా మారావు.
వంటింట్లో తల్లుల గుండెలపై ‘బండ’ బరువూ నువ్వే.
తండ్రులు నడుపలేక
చతికిలపడిన బతుకుబండి కరువూ నువ్వే.
ఇప్పుడందరి చూపు నిన్ను శిక్షించే వాడి కోసమే!
మడిపల్లి రాజ్‌కుమార్, 9949 699 215

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -