Monday, January 26, 2026
E-PAPER
Homeకరీంనగర్వృధాగా ఉన్న భవనాన్ని మహిళా సంఘానికి కేటాయించండి

వృధాగా ఉన్న భవనాన్ని మహిళా సంఘానికి కేటాయించండి

- Advertisement -

పాలకవర్గానికి మహిళలు వినతి పత్రం అందజేత 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 

గ్రామంలో వృధాగా ఉన్న భవనాన్ని మహిళా సంఘానికి కేటాయించాలని మహిళలు నూతన పాలకవర్గాన్ని కోరారు. మండలంలోని పద్మ నగర్ గ్రామంలో గత కొంతకాలంగా వృధాగా, ఖాళీగా ఉన్న భవనాన్ని గ్రామ సమైక్య మహిళ సంఘానికి కేటాయించాలని మహిళలు సోమవారం గ్రామ సర్పంచ్, పాలకవర్గానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న మహిళలందరం గ్రామ సమైక్య మహిళా సంఘంగా ఏర్పడి 20 సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు మాకు సొంత భవనం లేదని మహిళలు వాపోయారు.

20 సంవత్సరాలుగా మా మహిళలందరూ ఏవైనా సమావేశాలు నిర్వహించుకోవాలంటే చెట్ల కిందనో.. లేదంటే ఏదైనా అద్దె భవనంలో నిర్వహించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు. గత కొంతకాలం క్రితం గ్రామంలో నిర్మించిన భవనం వృధాగా ఉందని,ఖాళీగా ఉందని ఆ భవనాన్ని గ్రామ సమైక్య మహిళా సంఘానికి కేటాయించాలని కోరారు. మా సమైక్య సంఘంలో 41 మహిళా గ్రూపు సంఘాలు ఉన్నాయని, ఇందులో 451 మంది మహిళలు గ్రామానికి చెందిన వారే ఉన్నారన్నారు. నిరుపయోగంగా ఉన్న ఆ భవనాన్ని మాకు కేటాయిస్తే మా కార్యకలాపాలు ఆ భవనంలో నిర్వహించుకుంటామని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -