నవతెలంగాణ – తంగళ్ళపల్లి
దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించడంతో ఆ ప్రభుత్వ పాఠశాలకు విరాళాలు వెలుగుల వచ్చాయి. మండలంలోని తాడూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రాథమిక పాఠశాలకు గ్రామానికి చెందిన దాతలు విరాళాలను ధారాళంగా అందించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలకు దాతలు తమ వంతు సహకారంగా విరాళాలను అందించేందుకు ఒకరిని మించి మరొకరు ముందుకు వచ్చారు. ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, విద్యార్థులకు సమావేశాలకు వేదిక లేకపోవడంతో గ్రామానికి చెందిన వుప్పల వెంకట రమణారావు రిటైర్డ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్,రాష్ట్ర జ్యుడిషియల్ ఎంప్లాయిస్ అసోషియేషన్ జనరల్ సెక్రటరీ స్పందించి రూ.1.50 లక్షలు వెచ్చించి పాఠశాల ఆవరణలో వేదిక ప్రాంగణాన్ని నిర్మించారు.
ఆ ప్రాంగణాన్ని గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రారంభించారు. అదేవిధంగా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ సురభి సరిత నవీన్ రావు చొరవతో ప్రాథమిక పాఠశాలలో వెంకట రమణారావు అర్బన్ బ్యాంక్ సిరిసిల్ల వారి సౌజన్యంతో రూ.35వేల విలువగల ఎల్ఈడి టీవీ ని అందించారు. అలాగే ఉన్నత, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు క్రీడల్లో గెలుపొందిన వారికి వుప్పుల రమణమ్మ మెమొంటోలను, బహుమతులను అందజేశారు. పాఠశాలల కు ప్రహరీ గోడ నిర్మాణానికి వుప్పల జితేందర్ రూ.20వేలు నగదు అందజేశారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు అవసరమయ్యే గ్రంథాలయ పుస్తకాలను సొంత డబ్బులతో అందిస్తానని వుప్పుల సందీప్ తెలియజేశారు. అలాగే పదవ తరగతిలో టాపర్గా నిలిచిన విద్యార్థికి రూ.10 వేల నగదును అందిస్తానని అదే పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ టీచర్ గా పని చేస్తున్న గుడ్ల అరవింద రవి ప్రకటించారు.
ఈ నగదు బహుమతిని ప్రతి సంవత్సరం 10వ తరగతిలో టాపర్గా నిలిచిన విద్యార్థికి అందిస్తామని హామీ ఇచ్చారు. రిటైర్డ్ టీచర్ ముకుంద్ రూ.3వేలు అందిస్తానని ప్రకటించారు. స్టడీ అవర్స్ లో పదో తరగతి విద్యార్థులకు అల్పాహారానికి కొత్వాల్ వామన్ కుమార్, నగునూరి శేఖర్ లు రూ.2వేల ను అందించారు. వీటన్నింటిని ప్రధానోపాధ్యాయులు బూర రవిందర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ లకు అందజేశారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రెడిమల్ల సదానందం, ఉప సర్పంచ్ కోస్ని శ్రీధర్, పాలకవర్గ సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ లు రొడ్డ వాణి, మీస రేవతి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



