నవతెలంగాణ-కమ్మర్ పల్లి
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సులో కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించిన మండల కేంద్రానికి చెందిన చింతకుంట రాజును కమ్మర్ పల్లి బాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని కమ్మర్ పల్లి బాడ్మింటన్ అసోసియేషన్ ఇండోర్ స్టేడియం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు కానిస్టేబుల్ గా ఎంపికైన చింతకుంట రాజును కేబీఏ సభ్యులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కమ్మర్ పల్లి బాడ్మింటన్ అసోసియేషన్ క్లబ్ అధ్యక్షులు ఆకుల బాల కృష్ణ మాట్లాడుతూ గ్రామానికి చెందిన చింతకుంట రాజు సిఆర్పిఎఫ్ లో సైనికుడిగా ఉద్యోగం సాధించడం గర్వకారణం అన్నారు. రాజును స్ఫూర్తిగా తీసుకొని యువకులు దేశానికి సేవ చేసే వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించాలన్నారు. అంతకుముందు బాలకృష్ణ కమ్మర్ పల్లి బాడ్మింటన్ అసోసియేషన్ క్లబ్ వద్ద 77వ గణతంత్ర దినోత్సవ సందర్బంగా జాతీయ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి బాడ్మింటన్ అసోసియేషన్ క్లబ్ సభ్యులు లుక్క గంగాధర్, చిలువేరి పవన్ కుమార్, సురంగి చంద్రశేఖర్, పెంట కిషన్, భోగ శ్యామ్, సుంకేట శ్రీనివాస్, మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



