పాఠశాల ఎస్ఓ భవాని
నవతెలంగాణ – మల్హర్ రావు
బాల చెలిమి జాతీయ కథల పోటీల్లో భాగంగా 2025లో విద్యార్థులు రాసిన నేపథ్యంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం గాదంపల్లి నుండి పదవ తరగతి చదువుతున్న ఎస్.శ్రీవాణి అనే విద్యార్థిని ఎంపికైనట్లుగా పాఠశాల ఎస్ఓ భవాని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అమ్మాయి రాసిన యోగ్యత కథను బాల చెలిమి కథల పోటీకి పంపించడంతో ఎంపికైనట్లుగా చెప్పారని తెలిపారు. బాల చెలిమి 2025 కథల పుస్తకంలో ముద్రించి,విద్యార్థికి ప్రశంసా పత్రాన్ని, పుస్తకాన్ని పాఠశాలకు హైదరాబాద్ వారు పంపించడం జరిగిందన్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థినికి తనతోపాటు పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలైన కొత్తూరి రాధిక అందజేసి విద్యార్థిని అభినందించినట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయ కథల పోటీకి కేజీబీవీ విద్యార్థిని ఎంపిక.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



