Monday, January 26, 2026
E-PAPER
Homeజిల్లాలుఎంపీ చేతులమీదుగా ఉత్తమ అవార్డు అందుకున్న ఊరుకొండ ఎంపీడీఓ

ఎంపీ చేతులమీదుగా ఉత్తమ అవార్డు అందుకున్న ఊరుకొండ ఎంపీడీఓ

- Advertisement -

– అభినందనలు తెలిపిన అధికారులు, ప్రజాప్రతినిధులు..
నవతెలంగాణ – ఊరుకొండ 

ఊరుకొండ మండలంలో ఎంపీడీవో కృష్ణయ్య ప్రభుత్వ సూచనల మేరకు అన్ని విధాలుగా సేవలు అందించడంతో ఉత్తమ ఎంపీడీవో గా అవార్డు అందుకోవడం అభినందనీయమని ఊరుకొండ మండల అధికారులు ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు. సోమవారం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఎంపీ మల్లు రవి, జిల్లా కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిల చేతుల మదుగా అవార్డు అందుకున్నట్లు

ఎంపీడీవో తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఊర్కొండ మండలంలో సేవ చేసేందుకు అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ గారికి, శాసనసభ్యులు, జడ్చర్ల గారికి, ఇతర జిల్లా యంత్రాంగానికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు. ఊరుకొండ మండలానికి వచ్చినప్పటి నుండి నాకు అన్ని రకాలుగా సహకరిస్తున్న కార్యాలయ సిబ్బంది, గ్రామ స్థాయిలో నేను కోరిన సమాచారం అడిగిన వెంటనే ఇచ్చిన అందరు పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, అన్ని శాఖల గ్రామ, మండల స్థాయి అధికారులకు, ఏ గ్రామానికి వెళ్లినా సాదరంగా స్పందించిన ప్రజా ప్రతినిధులు, ప్రజలు, నాకు అన్ని విధాలుగా సహకరించిన శ్రేయోభిలాషులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో చేసే ప్రతి పనిని ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసిన పత్రిక, మీడియా సోదరులకు ధన్యవాదములు అని .. నాకు లభించిన ఈ అవార్డు పై అందరిదనీ..ఇది మీకే అంకితం అన్నారు. ఇక ముందు కూడ ఇలాంటి సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -