బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం
నవతెలంగాణ – రామారెడ్డి
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో త్రివర్ణ పథకాన్ని ఎగరవేసి, దేశ ప్రతిష్టను, గౌరవాన్ని చాటి చెబుతున్నా సోమవారం మండలంలోని రెడ్డి పేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ బ్యాంకు ముందు జెండా ఎగరవేయకపోవడంపై ఖాతాదారులతోపాటు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత వహించవలసిన బ్యాంకు సిబ్బంది హాజరు కాకపోవడం, కార్యక్రమం నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఘటనపై మేనేజర్ సుభాష్ ను వివరణ కోరగా… కామారెడ్డి రేంజ్ పరిధిలో గల గ్రామీణ ఎస్బిఐ సిబ్బంది అంతా కామారెడ్డిలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించామని, ఎక్కడ కూడా రూరల్ లో కార్యక్రమాలు నిర్వహించలేదని వివరణ ఇచ్చారు.
ఎస్బిఐలో ఎగరని త్రివర్ణ పతాకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



