Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాల అభివృద్ధికి గ్రామస్తుల సహకారం అభినందనీయం 

పాఠశాల అభివృద్ధికి గ్రామస్తుల సహకారం అభినందనీయం 

- Advertisement -

ఎంపీ యుపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏవి సంజీవరావు 
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని నైనాల పాఠశాల అభివృద్ధి కోసం గ్రామస్తులు కొంతమంది ముందుకు వచ్చి కొంత సహాయం చేసేందుకు ముందుకు రావడం పట్ల వారిని అభినందించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏవి సంజీవరావు తెలిపారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలు ఆటల పోటీలు మరియు డ్యాన్సులు వివిధ రకాల వేషాధనలతో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ యాసం సంధ్యా రమేష్, మరి ఉప సర్పంచ్ తిరుమల ఉపేందర్ గౌడ్ పాఠశాల చైర్మన్ రాధిక ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధి కోసం కొత్త ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు  చిర్ర శ్రీనివాస్ గౌడ్,మరియు శ్రీ దండంపెల్లి వెంకట సాయి  పాఠశాల ప్రాంగణంలో జాతీయ నాయకుల చిత్రపటాలకు పెయింటింగ్ ఖర్చులు ఇచ్చారు అని తెలిపారు. ఒర్సు సమ్మయ్య  పాఠశాల ప్రాంగణంలో వేదికపై రేకుల షెడ్డు నిర్మాణం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అని అన్నాడు..విద్యార్థులకు  నైనాల గ్రామ యూత్ సభ్యులు ”   నైనాల సూపర్ టైగర్స్ అసోసియేషన్” ,ఆర్.ఎం.పి డాక్టర్  ఖమ్మంపాటి  యాకయ్య,నాలుగవ వార్డు నంబరు  యాసం వెంకటేశ్వర్లు,మూడవ వాడు నెంబరు శ్రీమతి ఎలేంద్ర, తల్లిదండ్రుల నుండి  జాగిరి లింగరాజు బహుమతులు ప్రధానం చేశారు.

పాఠశాల ఉపాధ్యాయులు మండల రాజు గారి ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు  నృత్యం నిర్వహించారు. విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు చూసి గ్రామస్తులు  ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉపాధ్యాయుడు ప్రతి పాఠశాలలో ఉండాలని కోరారు , వచ్చే విద్యా సంవత్సరం గ్రామస్తుల సహకారంతో మా పాఠశాల విద్యార్థుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సోమయ్య రాంబాబు రాజు రాకేష్ సునీల్ మరియు లోకేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -